దైనందిన జీవితంలో సూర్యుడి యొక్క ప్రాముఖ్యత అందరికి తెలిసు. కానీ, కేవలము రోజు వారి ప్రగతి కోసము మాత్రమే సూర్యుడు ఉద్భవించలేదు. అయన యొక్క అసలైన ప్రాణ శక్తి కంటికి కనిపించకుండా మనందరి జీవితాలను ప్రభావితము చేస్తున్నది. మానవ జీవితము యొక్క అసలైన పరమార్ధము తన యొక్క శరీరమును మరియు మనుసును సృష్టి యొక్క ధర్మాల ద్వారా పురోగతికి తీసుకువెళడము. ఈ సూర్య దేవాలయములో ఆ విద్య నేర్పబడుతుంది.